వైరల్ : ఫుట్ బాల్ చరిత్రలోనే.. లాంగెస్ట్ గోల్?

praveen
ఫుట్ బాల్ ఆటకి అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ మ్యాచ్ జరుగుతున్న కూడా చూడడానికి అటు క్రీడాభిమానులు అందరూ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక అటు మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు ఫుట్బాల్ కి ఉన్న క్రేజ్ చూసి క్రికెట్ కు ఎక్కడ తక్కువగా లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగ్ లో ఎవరైనా ఆటగాడు అద్భుతమైన గోల్ కొట్టాడు అంటే చాలు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఇక ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఎలా సాధ్యమైంది అని అందరూ ఇక ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఇప్పటివరకు ఎవరు కనివిని ఎరగని విధంగా 101 మీటర్ల దూరం నుంచి గోల్ సాధించాడు ఇక్కడొక ప్లేయర్. చీలి దేశంలో జరుగుతున్న సాకర్ లీగ్ లో  ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. కోబ్రాసాల్, కోలో కోలా జట్ల మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఫుట్బాల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు నమోదయింది అని చెప్పాలి. కోబ్రా సాల్ జట్టు గోల్ కీపర్ గా ఉన్న లియాండర్ రిక్విన్ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత దూరం నుంచి గోల్ కొట్టాడు.

 ఆట ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా 77వ విషయంలో 2-0 గోల్స్ తేడాతో కోబ్రా సాల్  జట్టు లీడింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. గోల్ కిక్  పోస్ట్ నుంచి లియాండర్ రెక్విన్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ దిశగా కిక్ కొట్టాడు. అయితే ఆ బంతి కోలో కోల గోల్ కీపర్ ను దాటేసి నేరుగా గోల్ అయింది. అయితే పెనాల్టీ ఏరియా బయట ఉన్న గోల్ కీపర్ బ్రియాన్ కోర్టేస్ట్ ఆ బంతిని పట్టుకోలేకపోయాడు. స్టెప్ తిన్న తర్వాత ఒకసారిగా అది బౌన్స్ అయ్యింది.  వెంటనే కోలో కోలో గోల్ కీపర్ అప్రమత్తం అయినప్పటికీ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో లియాండ్రో  ఏకంగా 101 మీటర్ల దూరం నుంచి గోల్ కొట్టి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే ఇది లాంగెస్ట్ రేంజ్ గోల్ కావడం గమనార్హం. వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: