ముంబై ఆట తీరు మారలేదా.. ఆందోళనలో అభిమానులు?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. అయితే అభిమానుల అంచనాలను నిలబెడుతూ  టైటిల్ గెల్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని ఎన్నోసార్లు ఇక ఫైనల్ వరకు కూడా వెళ్ళింది అని చెప్పాలి. అలాంటి ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.


 ఎందుకంటే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టుకు క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని జయించడం పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఆ ఒత్తిడికే చిత్తు అయిపోయింది ముంబై ఇండియన్స్. ఎక్కడ సరైన ప్రదర్శన చేయలేకపోయింది అని చెప్పాలి. చివరికి ఎప్పుడు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచే ముంబై ఇండియన్స్ చిట్ట చివరన ఉండి ఇక సెమీఫైనల్స్ చేరుకోకుండానే లీగ్ దశ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ విషయాన్ని అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ ఏంటి ఇలాంటి ప్రదర్శన చేయడమేంటి అని ఆశ్చర్యపోయారు అని చెప్పాలి.


 అయితే గత ఏడాది వరస పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత ఎన్నో పాఠాలు నేర్చుకున్న ముంబై ఇండియన్స్ సరికొత్తగా 2023 ఐపీఎల్ సీజన్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మొదటి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని చవిచూసింది అని చెప్పాలి. ఇటీవలే మొదటి మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు ఎవరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఒకవేళ తిలక్ వర్మ లేకపోయి ఉంటే మాత్రం ముంబైకి ఇంకా ఘోరమైన ఓటమి తప్పేది కాదేమో అనడంలోనూ అతిశయోక్తి లేదు. అతి కష్టం మీద ముంబై 172 పరుగుల చేయగా.. లక్ష్య చేదనకు బరిలోకి బెంగళూరు జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరు గత ఏడాది లాగే ఉందా... ఇంకా మారలేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: