డిజె సౌండ్ ఆపమన్నందుకు.. తుపాకీతో కాల్చేశాడు.. చివరికి?
ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఇక మనిషి ప్రాణాలను చాక్లెట్ తిన్నంత ఈజీగా గాల్లో కలిపేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే క్షణికావేషంలో విచక్షణ కోల్పోతున్నవారు చివరికి దారుణాలకు పాల్పడుతున్నా తీరు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. దీంతో ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియక ప్రతి ఒక్కరు అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఢిల్లీలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
డిజె సౌండ్ ఇబ్బందిగా ఉంది ఆపు అని చెప్పినందుకు ఏకంగా ఆమె ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. హరీష్ అనే వ్యక్తి ఇంట్లో పూజ కార్యక్రమం సందర్భంగా పెద్దగా డీజే సౌండ్ పెట్టి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే పక్కింటి మహిళా రంజు డిజె సౌండ్తో ఇబ్బందిగా ఉందని.. సౌండ్ తగ్గించాలి అని కోరింది. దీంతో కోపంతో ఊగిపోయిన హరీష్ తుపాకీతో ఆమెను కాల్చాడు. దీంతో రంజు మెడకు బుల్లెట్ తగలడంతో హుటాహుటిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసే జైలుకు తరలించారు.