మ్యాచ్ గెలిచినా.. ధోని చేసిన పని ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు?
అయితే ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇక నిర్ణీత 20 ఓవర్లలో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 217 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 205 పరుగులకే పరిమితం అయింది అని చెప్పాలి. దీంతో చివరికి 12 పరుగుల తేడాతో అటు చెన్నైకి జట్టుకు విజయం వరించింది. అయితే చెన్నై జట్టు గెలిచినందుకు అభిమానులు సంతోషంగానే ఉన్న.. ధోని చేస్తున్న పని మాత్రం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. సాధారణంగా అయితే ధోని ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు ధోని. ఐపీఎల్ వచ్చినప్పుడు ధోని ఆటను చూడగలుగుతున్నారు అభిమానులు. అయితే చెన్నై మ్యాచ్ జరిగినప్పుడల్లా ధోని వస్తాడేమో తన ఆటతో అలరిస్తాడేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారూ. కానీ ధోని మాత్రం ఏకంగా ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ దిగుతున్నాడు. అప్పటికి ఒక ఓవర్ లేదా రెండు మూడు బంతులు మాత్రమే మిగిలి ఉంటున్నాయి. అయితే చివర్లో వచ్చి సిక్సర్లతో చెలరేగుతున్న.. ఎక్కువసేపు ధోని చూడాలనుకున్న ప్రేక్షకుల ఆశ మాత్రం తీరడం లేదు. దీంతో చెన్నై మంచి ప్రదర్శన చేసిన ధోని ఆట చూడలేకపోయాం అనే ఒక నిరాశ మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోతుంది.