ధోనికి అసలైన వారసుడు అతడే : సెహ్వాగ్
ఇలాంటి ఒక ఆటగాడు ఇండియాకి చక్కగా సరిపోతాడు అని, మంచి ఆరంభాలను ఇవ్వగలడని, అలాగే ప్రతి బాల్ ని కొడుతూ మంచి స్కోర్ గా మార్చుతూ, ఫోర్లు, సిక్స్ లు కొట్టి పెద్ద స్కోర్ మలిచే సత్తా ఉన్నా బ్యాట్స్మెన్ అంటూ వీరేంద్ర సెహ్వా రుతురాజ్ ని కొనియాడాడు. ప్రస్తుతం ఇలాంటి సత్తా ఉన్నవారు టీమిండియా జట్టులో లేరంటూ తనదైన రీతిలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. అర్ధ శతకాలు బాదడం మాత్రమే కాదు. వాటిని సెంచరీలుగా మలిచే సత్తా ఉన్న రుతురాజ్ అంటూ సెహ్వాగ్ తెలిపాడు.
రెండు సీజన్స్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతుండగా ఇప్పటికే ఒక సెంచరీ కూడా టీమిండియా తరఫున చేశాడు. అయితే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడం తనని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటూ చెప్తున్నాడు సెహ్వాగ్. చాలా మంది ఆటగాళ్లు టీమిండియాలో అవకాశాలు దక్కించుకుంటున్నారు, కొంతమంది బాగా రాణిస్తున్నారు కూడా. అతడు మాత్రం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తుందని చెబుతున్నాడు. ఇక ఈ సీజన్ బాగా ఆడితే రుతురాజ్ కి భారత్ టీం నుంచి ఖచ్చితంగా పిలుపు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా జోష్యం చెబుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ధోని లాంటి వ్యక్తి కి రుతురాజ్ ఒక మంచి వారసుడు అవుతాడు అంటున్నాడు.