విన్నింగ్ సిక్స్ బంతి పడిన సీటుకు.. ధోని పేరు?
ఇక మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఈ విషయం గురించి స్పందిస్తూ అలాంటి అనుభూతిని పొందడం మరోసారి సాధ్యం కాదని.. ఇక వరల్డ్ కప్ గెలవడానికి కొన్ని నిమిషాల ముందే నేను ఆ అనుభూతిని అనుభవించాను అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా 2011 వరల్డ్ కప్ లో ధోని కొట్టిన చివరి సిక్సర్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల మధ్య వెళ్లి పడింది. అయితే ఇక ఇప్పుడు ఈ విషయం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.
2011 ప్రపంచ కప్ విజయానికి గుర్తుగా వాంకడే స్టేడియంలో విజయ స్మారకాన్ని నిర్మించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. స్టాండ్స్ లో ఇక ధోని కొట్టిన సిక్సర్ సమయంలో బంతి పడిన సీటుకు ధోని పేరు పెట్టాలని ఇక ఇలా ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందట. ఈనెల 8వ తేదీన దీనిని మహేంద్రసింగ్ ధోని స్వయంగా ప్రారంభిస్తాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి ధోని అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి.