దూసుకుపోతున్న రషీద్ ఖాన్.. టి20ల్లో తగ్గేదేలే?

praveen
ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన స్పిన్నర్లు ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా అతని పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అతను ఎవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రషీద్ ఖాన్. తన స్పిన్ బౌలింగ్ తో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను బోల్తా కొట్టించి వికెట్లను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు రషీద్ ఖాన్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎంతటి స్టార్ బ్యాట్స్మెన్ అయినా రషీద్ ఖాన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే కాస్త ఆచితూచి ఆడుతూ వికెట్ ను కాపాడుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.


 మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో అయితే రషీద్ ఖాన్ మించిన స్పిన్నర్ మరొకరు లేరేమో అనేంతలా అతను ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు దేశవాళీ లీగ్ లలో కూడా అదే రీతిలో సత్తా చాటుతూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇక రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ను తమ జట్టులో చేర్చుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు  కూడా పోటీ పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పాలి..


 ఈ క్రమంలోనే ఇక వరుసగా మ్యాచ్ లలో కీలకమైన వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల ఒక అరుదైన ఘనత కూడా సాధించాడు అని చెప్పాలి. టీ20 కెరియర్ లో ఇప్పటివరకు 389 ఇన్నింగ్స్ లు ఆడిన రషీద్ ఖాన్ 530 వికెట్లు తీసాడు. ఇక రషీద్ ఖాన్ 24 ఏళ్ల వయసులోనే 500 వికెట్లు పూర్తి చేయగా.. కెరియర్ పూర్తయ్యలోపు టి20 ఫార్మాట్లో  ఎంతో సులభంగా 1000 వికెట్ల మార్కును అందుకుంటాడు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా రషీద్ ఖాన్ కెరియర్ లో బెస్ట్ గణాంకాలు 17 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీయడం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: