ఇదేం ట్విస్ట్.. ధోని, కోహ్లీ కాదు.. రుతురాజ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే?
2022 సీజన్లో 368 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్లో మొదటి మ్యాచ్లో 92 పరుగులు, రెండో మ్యాచ్లో 57 పరుగులు చేసి మళ్ళీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల యువ ఆటగాడు ఋతురాజ్ గైక్వాడ్ అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఊహించని ట్వెస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. సాధారణంగా ఏ యువ ఆటగాడిని నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగితే ధోని లేదా కోహ్లీ, రోహిత్ పేరు చెబుతారు. కానీ రుతురాజుకి ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు అతను ఎవరు ఊహించుని సమాధానం చెప్పాడు. ధోని, కోహ్లీ సచిన్ కాదు సురేష్ రైనా నా ఇన్స్పిరేషన్ అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు.
తన ఫేవరెట్ క్రికెటర్ సురేష్ రైనా అని.. అతనే నా రోల్ మోడల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతడిలాగే చెన్నై జట్టుకు ఆడాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టాడు. దీంతో ఇక ఋతురాజు చెప్పిన సమాధానంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. క్రికెట్లోకి వచ్చే చాలామంది ప్లేయర్స్ సచిన్, విరాట్ ధోని పేరు చెబితే రుతురాజ్ గైక్వాడ్ మాత్రం మొదటిసారి రైనా పేరును తెరమీద తీసుకురావడంతో ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సురేష్ రైనా మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్నాడు. చెన్నై జట్టు తరఫున ఎన్నో అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.