ఐపీఎల్ : అన్నొచ్చాడు.. నిండా ముంచేసాడు?
ఐడెన్ మార్కరమ్ చేరిక తర్వాత ఇక అటు జట్టు అభిమానుల్లో కొత్త జోష్ చేరిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ ప్రభంజనం మొదలైంది అంటూ లక్నోతో మ్యాచ్ కు ముందు అభిమానులు అందరూ ఎన్నో పోస్టులు పెట్టారు. కానీ కట్ చేస్తే ఇక జట్టులో చేరిన ఐడెన్ మార్కరమ్ కెప్టెన్సీ చేపట్టి జట్టును గెలిపించాల్సింది పోయి.. ఏకంగా తొలి మ్యాచ్ లోనే గోల్డెన్ డకౌట్ గా పెవెలియన్ చేరాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అని చెప్పాలి. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలం అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినంత పని అయింది అని చెప్పాలి.
అన్నొచ్చాడు ఏదో చేస్తాడు అనుకుంటే.. ఇలా గోల్డెన్ డకౌట్ అవడం ఏంటి అని సన్రైజర్స్ జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ లోనే ఇలా గోల్డెన్ డక్ గా వెనుతిరిగితే ఇక తర్వాత మ్యాచ్లో పరిస్థితి ఏంటో అని ఊహించుకోవడానికే భయపడిపోతున్నారు. ఏంటి బ్రో నమ్మకం పెట్టుకుంటే ఇలా చేసేసావు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు సన్రైజర్స్ ఫ్యాన్స్. అయితే ఎంతమంది కెప్టెన్లు వచ్చినా అటు సన్రైజర్స్ ఆట తీరు మాత్రం ఏ మాత్రం మారడం లేదు అని చెప్పాలి. పార్ట్ టైం బౌలర్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్లో సన్రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ అవ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్.