అతను ధోనికే కెప్టెన్సీ నేర్పించాడు : కోహ్లీ

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు కెప్టెన్సీ వహించడం విషయంలో ఎంత దిట్ట అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఎంత సమర్ధుడు అన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలుసు. అలాంటి ధోనీకి కెప్టెన్సీ విషయంలో మెలుకువలు నేర్పించడం.. ఇక విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ కు బ్యాటింగ్లో సలహాలు ఇవ్వడం ఎవరు చేయరు అని చెప్పాలి. ఒకవేళ అలా చేశారు అంటే అతను ఎవరో క్రికెట్ లెజెండ్ అయి ఉండాలి.


 ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా విమానంలో ధోనీకి కెప్టెన్సీ పై మెలుకువలు.. అటు విరాట్ కోహ్లీకి బ్యాటింగ్లో సలహాలు ఇచ్చాడట. అయితే అతను క్రికెట్ లెజెండ్ అనుకోకండి. ఒక సాధారణ కంపెనీలో మేనేజర్ స్థాయిలో పనిచేసే వ్యక్తి. ఇటీవలే ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆర్ సి పి పాడ్ కాస్ట్ లో ఇటీవలే మాట్లాడాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇండియా కొచ్చి నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. ఓ అభిమాని ఎంతో ఉత్సాహంతో మా దగ్గరికి వచ్చాడు.



 వచ్చి రాగానే ధోని వద్దకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టారు. కెప్టెన్సీ కి సంబంధించి ధోనికే టిప్స్ ఇవ్వడం ఇప్పటికీ గుర్తుంది. తుది జట్టు ఎంపిక పైన కూడా సూచనలు చేశాడు. అతను ఎంత మాట్లాడుతున్న ధోని మాత్రం చాలా కామ్ గా వింటూ ఉండిపోయాడు. ఇక తర్వాత ధోని దగ్గర నుంచి ప్రయాణికుడు అతను సీట్ దగ్గరకు వెళ్తుంటే.. మధ్యలో నేను కనిపించా. అక్కడే ఆగి నీ బ్యాటింగ్ సంగతేంటి అంటూ ప్రశ్నించాడు. దీంతో నేను షాక్ అయ్యా. అంతకు ముందు కొన్ని మ్యాచ్ లలో సరిగ్గా రానించలేకపోయా. అదే విషయం గురించి అతను మాట్లాడాడు. వచ్చే మ్యాచ్లో సెంచరీ చేయాలని సూచించాడు. దీంతో క్లాస్ పీకాలని డిసైడ్ అయ్యా. వచ్చే మూడు నెలల్లో నువ్వు పని చేసే కంపెనీకి చైర్మన్ అయిపోవాలని చెప్పా. అదెలా కుదురుతుంది అన్నాడు. అదే నా విషయంలో ఎలా అడుగుతారు అంటూ నేను ప్రశ్నించడంతో అతను మరో మాట మాట్లాడలేదు అంటూ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: