జక్కన్న ప్రతి సినిమాలో.. చత్రపతి శేఖర్ ఎందుకుంటాడో తెలుసా?

praveen
దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై మీసం తిప్పుకునేలా చేసాడు అన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా తెలుగు సినిమా గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి.

 దీంతో ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూసిన బాలీవుడ్ స్టార్స్ జక్కన్న సినిమాలో ఒక చిన్న రోల్ వచ్చిన కూడా చాలు అని ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా రాజమౌళి ఏదైనా కథను సిద్ధం చేసుకున్నాడు అంటే చాలు ఆ కథలో పాత్రల  కోసం ఎవరైతే బాగుంటుంది అనే విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటాడు. కానీ రాజమౌళి తీసిన ప్రతి సినిమాలో కొంతమంది నటులు మాత్రం రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్నటికి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు జక్కన్న ప్రతి ప్రాజెక్టులో చత్రపతి శేఖర్ కనిపిస్తుంటారు.

 ఇప్పుడు వరకు రాజమౌళి 12 సినిమాలు తీయగా తొమ్మిది సినిమాల్లో శేఖర్ ఉన్నాడు. అయితే ఇలా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా శేఖర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించడానికి కారణం కూడా ఉందట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ సమయంలోనే శేఖర్ తో రాజమౌళికి పరిచయం ఏర్పడిందట. శేఖర్ ఎప్పుడు జక్కన్నను చాన్స్ ఇవ్వమని అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి తనకు అవకాశాలు ఇస్తూ ఉంటారని చత్రపతి శేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా మొదలయ్యాక జక్కన్న నుంచి తనకు కాల్ వస్తుందని.. తన పాత్ర ఏంటి అన్న విషయం కూడా అప్పటివరకు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు శేఖర్. సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయానికి జక్కన్న ఇస్తున్న గౌరవం గురించి తెలిసి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: