40 ఏళ్ళ వయసులో.. స్టన్నింగ్ క్యాచ్.. అదుర్స్ కదూ?
ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇటీవల లక్నో జట్టులో స్టార్ బౌలర్ గా ఉన్న మార్క్ వుడ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిన నేపథ్యంలో ఇక అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 40 ఏళ్ల అమిత్ మిశ్రా ఇక కాస్త లేటు వయసులో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఏకంగా రిస్కీ విన్యాసాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఇక ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరిని ఫిదా చేసేసాడు అమిత్ మిశ్రా.
ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యష్ ఠాగూర్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి థర్డ్ మాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంతి ఔట్ సైడ్ అయ్యి బ్యాట్ ఏడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. 40 ఏళ్ల వయసులో మిశ్రా కళ్ళు చెదిరే క్యాచ్ పట్టడంతో ఇది చూసి అభిమానులు ఫిదా అయ్యారు. స్టన్నింగ్ క్యాచ్ తర్వాత వయస్సుతో పనేంటి అని అమిత్ మిశ్రా నిరూపించాడు అంటూ ఎంతో మంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా అతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు అని చెప్పాలి. ఇక బౌలింగ్లో సైతం మిశ్రా మెరిసాడు. తన ఆఖరి ఓవర్ లో ఏకంగా రెండు వికెట్లు తీసుకున్నాడు.