మహిళా క్రికెటర్ల పై వేధింపులు.. కోచ్ అరెస్ట్?

praveen
సాధారణంగా కోచ్ అనేవాడు ప్లేయర్లకు మార్గదర్శిగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. కేవలం మెలకువలను నేర్పించడమే కాదు క్రీడా స్ఫూర్తిని నేర్పించడంలో కూడా కోచ్ ఎప్పుడు ముందుంటాడు అని చెప్పాలి. సరైన కోచ్ ఉన్నప్పుడే ఆటగాడు ఇక అంతర్జాతీయ వేదికలపై బాగా రాణించి విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అటు క్రికెట్ ఆటలో కూడా కోచ్ల పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఆయా జట్లకు కోచ్లుగా ఉన్న వారు ఇక ప్లేయర్ల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే కేవలం పురుషుల క్రికెట్లో మాత్రమే కాదు అటు మహిళా క్రికెట్లో కూడా పురుష కోచ్ లు ఉండడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఇక ఇలా ఆయా జట్లకు కోచ్ లుగా వ్యవహరిస్తున్న వారిపై మహిళా క్రికెటర్లు వేధింపులకు గురి చేశారు అంటూ ఆరోపణలు చేయడం కూడా అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ సంచలనంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో క్రికెట్ బోర్డు విచారణ కోసం ఒక కమిటీని నియమించి నేరం రుజువైతే కఠిన శిక్ష వేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.

 ఇక్కడ ఒక వ్యక్తిని ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు మహిళా క్రికెటర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు రావడంతో టీమిండియా మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు. వేధింపులు ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఎయిమ్స్ లో చేర్పించారు పోలీసులు. ఇక డిశ్చార్జ్ అనంతరం అరెస్టు చేశారు. గతంలో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా పని చేశాడు నరేంద్ర. ఇక ఇటీవలే ఒక అమ్మాయితో అసభ్యకరమైన చాటింగ్ చేసిన ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: