స్టార్ ప్లేయర్ దూరం.. హమ్మయ్య అనుకుంటున్న ఢిల్లీ ఫ్యాన్స్?
జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇక కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నాడట. వివాహం నేపథ్యంలో ఇక వ్యక్తిగత కారణాలవల్ల అతను స్వదేశానికి పయనం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఢిల్లీ జట్టుకు వారం రోజులపాటు అతను అందుబాటులో ఉండబోడు అని సమాచారం. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ తో జరగబోతున్న మ్యాచ్ తో పాటు ఈనెల 11వ తేదీన ముంబై ఇండియన్స్ తో జరగబోయే మ్యాచ్ కి కూడా మిచెల్ మార్ష్ దూరం కాబోతున్నాడట. ఇక మిచెల్ మార్ష్ లాంటి కీలక ప్లేయర్ లేకుండానే అటు మ్యాచ్ ఆడబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.
అయితే కొంతమంది అభిమానులు అతను జట్టుకు అందుబాటులో ఉండకపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది అభిమానులు మాత్రం అతను జట్టు నుంచి తప్పుకోవడమే మంచిదైంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు మిచెల్ మార్ష్. ఒకవేళ అతను జట్టుకి అందుబాటులో ఉండకపోతే ఇక అతను స్థానంలో.. కొత్తవారికి అవకాశం వచ్చి ఇక ఇలా కొత్తగా వచ్చిన ఆటగాడైనా రాణించే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.