ఐపీఎల్ హిస్టరీలో.. వార్నర్ అత్యంత అరుదైన రికార్డు?
ఏకంగా భారత జట్టు స్టార్ ప్లేయర్లకు సైతం సాధ్యం కాని రికార్డులు అటు విదేశీ ప్లేయర్ అయినా డేవిడ్ వార్నర్ పేరిట ఉన్నాయి అనడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల మరోసారి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు గెలుపు ఓటములు పక్కన పెడితే వార్నర్ ప్రదర్శన మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్ హిస్టరీలో 6000 పరుగులు సాధించిన మూడో ప్లేయర్గా మారిపోయాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా కూడా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.
డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఐపీఎల్లో 6000 పరుగులను పూర్తి చేసుకున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇక సారధ్య బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం మంచి ప్రదర్శన చేశాడు. దీంతో 6000 పరుగుల మార్కును అధిగమించాడు అని చెప్పాలి. ఇక ఈ అరుదైన ఘనత సాధించడం పై డేవిడ్ వార్నర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.