రుతురాజ్ అత్యంత అరుదైన రికార్డ్.. ఐపీఎల్ లో ఒకే ఒక్కడు?

praveen
రుతురాజ్ గైక్వాడ్.. అప్పుడు వరకు దేశ వాలి క్రికెట్లో ఉన్న సమయంలో ఇతని పేరు పెద్దగా ఎవరికి తెలియదు. ఇక ధోని కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం తక్కువ సమయం లోనే ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ యువ క్రికెటర్. అయితే ఇక అరంగేట్రం మ్యాచ్లోనే డకౌట్ కావడంతో ధోని ఇలాంటి వాడిని సెలెక్ట్ చేశాడు ఏంటబ్బా అని ఎంతో మంది అనుకున్నారు.  కానీ ఆ తర్వాత అతని మెరుపు ఇన్నింగ్స్ లు చూసి ధోని సెలెక్ట్ చేశాడు అంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అని భావించారు.

 ఇక ఇప్పుడు తన అద్భుతమైన ప్రతిభతో ప్రతి సీజన్లో కూడా అదరగొడుతూ ఉన్నాడు రుతురాజు గైక్వాడ్. అంతేకాదు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల లిస్టులో మొదటి వరుసలోనే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మిగతా ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేసిన తనకు సంబంధం లేదు అన్నట్లుగానే.. తన పని తాను చేసుకుంటూ భారీగా పరుగులు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు.  ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా ఇలాగే జట్టుకు మంచి ఆరంబాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అరుదైన రికార్డులు సృష్టించాడు రుతురాజ్ గైక్వాడ్.

 ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో ఆడిన ప్రతి ప్రత్యర్థి పై కూడా 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా రుతురాజు గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో, రాజస్థాన్, సన్రైజర్స్, ఢిల్లీ, కోల్కతా,  పంజాబ్, బెంగళూరు జట్లపై హాఫ్ సెంచరీ చేసి హౌరా అనిపించాడు రుతురాజ్ గైక్వాడ్. ఐపిఎల్ చరిత్రలో ఆడిన ప్రత్యర్థులందరిపై కూడా 50 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక ఆటగాడిగా రుతురాజు కైక్వాడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక అతని ఆట తీరు చూస్తే మరికొన్ని రోజుల్లోనే అతను టీమిండియాలోకి వచ్చి అక్కడ విధ్వంసం సృష్టించడం ఖాయం అన్నది మాత్రం అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: