ఐపీఎల్ : అదిరిపోయింది.. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇలా ఉండాలి?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి కూడా అటు బీసీసీఐ ఐపీఎల్ లో కొత్త రూల్ను తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ తీసుకువచ్చింది. ఇక ఈ రూల్ ద్వారా మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు కూడా ఏ సమయంలో అయినా ఒక ఆటగాడిని మరో ఆటగాడితో రీప్లేస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా జట్టులోకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆటగాడు బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఇక ప్రతి జట్టు ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఉపయోగించుకుని మ్యాచ్ మధ్యలో కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాయి.

 అయితే ఇక ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎవరూ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య  వచ్చి ఇంపాక్ట్ చూపించిన వారు ఎవరూ లేరు. కానీ ఇటీవల ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి సరైన న్యాయం చేశాడు ఒక ఆటగాడు. ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన ఆటగాడు.. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టాడు అని చెప్పాలి.

 ఇలా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్.. 40 బంతుల్లో 8 ఫోర్లు ఐదు సిక్సర్లతో విధ్వంసం  సృష్టించి 80 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు ఇదే వెంకటేష్ అయ్యర్ కు అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక గుజరాత్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడానికి కావలసిన ఇంపాక్ట్ ను వెంకటేష్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ఇక ఒకవైపు ఇంపాక్ట్ క్లియర్ వెంకటేష్ అయ్యర్ మెరువగా.. ఇక చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమైన సమయంలో రింకు సింగ్ వరుసగా 5 సిక్సర్లతో చెలరేగిపోయి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక అంతకుముందు రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి కోల్కతా జట్టును దెబ్బ కొట్టినప్పటికీ రింగు విధ్వంసాన్ని మాత్రం గుజరాత్ యష్ దయాల్  బౌలర్ ఆపలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: