అతని వల్లే ఓడిపోయాం : రషీద్ ఖాన్

praveen
గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరుస విజయాలతో జోరు కనబరిచిన గుజరాత్ టైటాన్స్  అటు ఐపిఎల్ లో మొదటి ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇక తాత్కాలిక కెప్టెన్ గా రషీద్ ఖాన్ వ్యవహరించాడు. ఇక అతని కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.

 చివరి ఓవర్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయానికి 29 పరుగుల అవసరమైన సమయంలో ఇక గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయం అనుకున్నప్పుడు అటు రింకు సింగ్ అద్భుతం చేశాడు అని చెప్పాలి. వరుస సిక్సర్లతో చెలరేగిపోయి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక తన కెరీర్లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఓటమిపై మాట్లాడిన రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి ఓవర్ లో చెలరేగిపోయిన రింకు సింగ్ పై ప్రశంసలు కురిపించాడు.

 చివర్లో రింకు సింగ్ అసాధారణమైన షాట్స్ ఆడాడు అంటూ కొనియాడాడు రషీద్ ఖాన్. ఇది మాకు చాలా కఠినమైన మ్యాచ్ ఒక కెప్టెన్ గా నాకు మరింత బాధ పెట్టే ఫలితం. చివరి ఓవర్ లో 30 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాం. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితినే మేం ఎదుర్కొన్నాం. కానీ ఆ మ్యాచ్ లో గెలిచాము. అయితే ఇక ఈ ఓటమి నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మొత్తానికి ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాని మాత్రం అందించింది. ఇందులో బౌలర్ యష్ దయాల్ తప్పులేదు. ప్రణాళికకు తగ్గట్టుగానే బౌలింగ్ చేశాడు. కానీ రింకు సింగ్ అసాధారణ షాట్స్ వల్లే ఓడిపోయాం. కోల్కతా విజయం క్రెడిట్ అతనికే దక్కుతుంది అంటూ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: