ఓడిపోవడంలో ఢిల్లీ హ్యాట్రిక్.. సహ యజమాని ఏమన్నాడో తెలుసా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇక ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటుందా అంటే అవననే సమాధానమే ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఐపీఎల్ లో అన్ని జట్లు కూడా గెలుపు ఓటములతోనే ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాయి. ఒక మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ మరో మ్యాచ్ లో పుంజుకుని విజయం సాధిస్తున్నాయి. టైటిల్ గెలవడమె లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 కానీ అటు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అలాంటి ప్రస్థానాన్ని కొనసాగించడం లేదు. ఇక ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్ నుంచి ఇక మొన్నటి మూడో మ్యాచ్ వరకు కూడా వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమి చవి చూసింది. ప్రత్యర్థికి ఎక్కడ పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోతుంది అని చెప్పాలి. ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవ్వరూ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇక వార్నర్ పరుగులు చేస్తున్న వన్డే, టెస్ట్ మ్యాచ్ తరహాలో ఎక్కువ బంతులను వృధా చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ లో కూడా వేగం ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు వరకు వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో, గుజరాత్, రాజస్థాన్ జట్ల చేతుల్లో ఓడిపోయింది.

 ఇక ఇలా వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోవడాన్ని అటు అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని అయినా పార్ధ్ జిందాల్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోయాం. జట్టును ఇలా చూడటం ఎంతో కష్టంగా ఉంది. బ్యాటింగ్ ఫీల్డింగ్ లో లోపాలు ఉన్నాయి. అయితే తమ జట్టుపై మాత్రం పూర్తి నమ్మకం ఉంది. ఇక తర్వాత మ్యాచ్లలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. కమాన్ ఢిల్లీ అంటూ ఒక పోస్ట్ పెట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: