భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కి కెప్టెన్ కూల్ గా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ కోసం ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు కలిగి ఉన్న ధోని వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఇక ఇండియాలో అనేక మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తమతో పోటీపడి ఆడే మ్యాచ్ ల కోసం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నారు.
ఇటీవల ఒక విమానంలో చెన్నై జట్టు ప్రయాణిస్తున్న సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే తమ ప్రత్యర్థి తో మ్యాచ్ ఆడటానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక మైదానం నుంచి మరొక మైదానం కి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ క్రమం లో తమ జట్టుతో ధోని ప్రయాణిస్తున్న ఫ్లయిట్ కెప్టెన్ ధోని కి వీరాభిమాని. దాంతో విమానంలో ఒక అంనౌన్స్మెంట్ చేసాడు.
40 ఏళ్ళు దాటి వయసు మీద పడుతున్న ధోని వచ్చే ఏడాది కి ఐపీల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సదరు విమానం పైలెట్ ముందు ముందు కూడా చెన్నై జట్టుకు ధోని ప్రాతినిధ్యం వహించాలని, మీకు నేను వీరాభిమానిని అంటూ ప్రకటన చేయడం ప్రయాణికులు కూడా సంతోషం లో మునిగిపోయారు. దీనికి సంబందించిన వీడియోలను సోషల్ మిడిల్ లో అప్లోడ్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లో విజయడంకా మోగించి ఒక మ్యాచ్ లో మాత్రం పరాజయం పాలయ్యింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానం లో ఉంది చెన్నై.