ఢిల్లీ ఓడిపోయినా.. వార్నర్ అరుదైన రికార్డ్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఆటగాళ్ల లిస్టు తీస్తే.. అందులో ఇక అటు డేవిడ్ వార్నర్ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఇండియాలో స్వదేశీ ఆటగాళ్లు సైతం ఆడలేనంత అద్భుతంగా అటు డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ప్రస్తానాన్ని కొనసాగించాడు. ప్రతి సీజన్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉండేవాడు డేవిడ్ వార్నర్. ఇకపోతే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఇక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్లు ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా అటు విజయం సాధించలేక పోయింది అని చెప్పాలి. నాలుగు మ్యాచ్లలో కూడా ప్రత్యర్థికి  పోటీ ఇవ్వలేక ఘోర ఓటమి చూసింది. అయితే అటు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఓటమిని చవి చూస్తూ ఉన్నప్పటికీ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ మాత్రం మంచి ఇన్నింగ్స్ ల తో  ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.. ఇక మిగతా బ్యాట్స్మెన్ నుంచి సహకారం లేకపోవడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా పరాజ్యం పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓడిపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ వార్నర్ మాత్రం అరుదైన రికార్డు సాధించాడు.



 ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 6 ఫోర్లు కొట్టిన డేవిడ్ వార్నర్ ఒక అరుదైన మైలు రాయికి చేరుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 600 ఫోర్లు కొట్టిన తొలి విదేశీ ప్లేయర్గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇక వార్నర్ కంటే ముందు శిఖర్ ధావన్ 728 ఫోర్ లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇలా ఐపిఎల్ హిస్టరీలో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టు తీస్తే డేవిడ్ వార్నర్ రెండవ స్థానంలో ఉండగా.. తొలి విదేశీ ప్లేయర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అయినప్పటికీ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో ఇక డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: