లంబోర్గిని కార్ కంటే.. ఈ దున్న ఎక్కువ కాస్లీ తెలుసా?

praveen
ఇటీవల కాలంలో పాడి పశువులతో వ్యాపారం చేయడం వల్ల భారీగా లాభాలు ఆర్జిస్తూ ఇక లక్ష్యాధికారులుగా మారిపోతున్న వారు చాలామంది వార్తల్లో  నిలుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాడి పశువులకు సంబంధించిన వ్యాపారానికి కూడా అటు మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇక మంచి మేలు జాతికి చెందిన గేదెలను, దున్నలను కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ధర ఉండే గేదెలు దున్నలకు సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి మేలు రకం దున్న గురించి అని చెప్పాలి. హరియానాకు చెందిన ముర్రా జాతి దున్నపోతు షేహన్ షా కు ఉన్న డిమాండ్ ముందు లగ్జరీ కార్ల ధరలు కూడా దిగదుడిపే అని చెప్పాలి. ఎందుకంటే ఈ గేదెను కొన్న ధరతో ఏకంగా లగ్జరీ కార్లు ఒకటి కాదు రెండు కాదు అంతకంటే ఎక్కువే కొనేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా ఏకంగా ఈ దున్న ధర అక్షరాల 25 కోట్ల రూపాయలు.  వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. కానీ నిజంగానే ఈ దున్నకు ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది అని చెప్పాలి. పనిపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు ఈ మేలు రకం దున్నపోతును పెంచుకుంటున్నాడు.



 దీని ముద్దు పేరు శేహన్ షా. దీని వయసు పదేళ్లు కావడం గమనార్హం. 15 అడుగుల పొడవు,  ఆరడుగుల ఎత్తు ఉంటుంది ఈ దున్న. వీటి వీర్యానికి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది అని చెప్పాలి. ఇక నెలలో నాలుగు సార్లు షేహన్ షా వీర్యాన్ని బయటకి తీస్తారు అని చెప్పాలి. ఇక ఈ వీర్యంతో దాదాపు 800 డోసులు తయారు చేస్తారు. ఇక వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోస్ కు 300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పాలి. అనంతరం దీనిని మార్కెట్లో విక్రయించి ఇక నెలకు 9.60 లక్షల వరకు సంపాదిస్తున్నాడట షేహన్ షా యజమాని నరేంద్ర సింగ్. అందుకే ఈ ముర్రా జాతి దున్నలను హరియాణాలో నల్ల బంగారం అని కూడా అంటూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: