నాడు 6.50 కోట్లు,..నేడు కేవలం 50 లక్షలు .. కానీ కమ్ బ్యాక్ అదుర్స్?
ఇప్పడు తనకు టైం వచ్చింది అంటున్నాడు మోహిత్ శర్మ. తాను మళ్లి రీఎంట్రీ ఇస్తాను అని అనుకోలేదు అని గుజరాత్ జట్టు తో ఆడటం తనకు ఎంతో నచ్చిందని, డ్రెస్సింగ్ రూమ్ చాల సరదాగా ఉంటుంది అని, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య, అలాగే కౌచ్ నెహ్రా తనకు మంచి ప్రోత్సాహం అందించడం వల్లే తాను మళ్లి ఆడగలిగాను అంటూ చెప్తున్నాడు. తన పునరా గమనం వెనక ఉంది కేవలం నెహ్రా అంటూ అతడికి కృతజ్ఞతలు తెలుపు తున్నారు.
నిన్నటికి నిన్న పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ గెలవడం లో మోహిత్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్ పాత్ర ఖచ్చితం గా ఉంది. 2014 లో చెన్నై టీమ్ కోసం ఆడిన మోహిత్ అప్పుడు అత్యధిక వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ ధరించాడు. ఆశిష్ నెహ్రా మోహిత్ శర్మను తిరిగి ఐపీల్ లో అడుగు పెట్టాలి అంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. అతడు చెప్పినట్టు గానే దేశవాళీ క్రికెట్ ఆడుతూ తన ఆటను మెరుగు పరుచుకున్నాడు. ఇప్పటూ మళ్లి గుజరాత్ కోసం ఆడుతూ తానేంటో నిరూపించు కుంటున్నారు. సరైన కౌచ్ మరియు కెప్టెన్ ఉంటె ఎలాంటి అద్భుతాలైన కూడా సాధించవచ్చు అని మోహిత్ ఆట చూస్తే అర్ధం అవుతుంది.