ఐపీఎల్ : హైదరాబాద్ vs ముంబై.. హ్యాట్రిక్ కొట్టేదెవరో?
రెండు జట్లలో కూడా బ్యాట్స్మెన్లు గాడిలో పడి మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే అటు హైదరాబాద్ ఇటు ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించడం పై దృష్టిపెట్టాయి అని చెప్పాలి. ఇక అటు సన్రైజర్స్ హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతూ ఉండడం ఇక ఆ జట్టుకు కాస్త కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. కాగా హైదరాబాద్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్ లో కనిపిస్తుంది కెప్టెన్ మార్కరమ్ సహా హరిబ్రూక్ ఫామ్ లోకి వచ్చారు.
అంతకుముందు జరిగిన మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ లు కూడా అటు స్పిన్నర్లపై పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు అని చెప్పాలి. దీంతో హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోయాయి అని చెప్పాలి. వీరికి తోడుగా మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ లో తెలుగు తేజం తిలక్ వర్మపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది అని చెప్పాలి. హైదరాబాద్ క్రికెటర్ కావడంతో హోం గ్రౌండ్లో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడు చూసేందుకు అందరు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది.