ఐపీఎల్ లో తొలి వికెట్.. అర్జున్ ఏమన్నాడంటే?

praveen
సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్ లో ఎంత దిగ్గజమో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదండోయ్ ప్రపంచ క్రికెట్లో ఉన్న లెజెండ్స్ అందరిలో కూడా సచిన్ టెండూల్కర్ పేరే ముందుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక భారత క్రికెట్కు రెండు దశాబ్దాల పాటు సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ గా, క్రికెట్ దేవుడిగా భారత క్రికెట్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే సచిన్ వారసుడిగా అదే క్రికెట్లోకి అడుగు పెట్టిన అర్జున్ టెండూల్కర్ కి మాత్రం ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదు అని చెప్పాలి.

 ముఖ్యం గా ఐపీఎల్ లో అర్జున్ ఆడుతాడేమో అని గత రెండు మూడు సీజన్ల నుంచి కూడా అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ అర్జున్ టెండూల్కర్ కి తుది జట్టు లో మాత్రం చోటు దక్కలేదు. ఎట్టకేలకి 2023 ఐపీఎల్ సీజన్లో అర్జున్ టెండూల్కర్ కి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం దొరికింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో కూడా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అంతేకాదు రోహిత్ అతనిపై నమ్మకం ఉంచి డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ వేయిస్తున్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తన తొలి ఐపిఎల్ వికెట్లు నమోదు చేశాడు అర్జున్ టెండూల్కర్. కీలకమైన ఆఖరి ఓవర్ ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భువనేశ్వర్ కుమార్ వికెట్ పడగొట్టి ముంబై జట్టుకు విజయం అందించాడు. అయితే ఐపీఎల్ లో తనకు తొలి వికెట్ దక్కడంపై అర్జున్  సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్కి ముందు ప్లాన్స్ గురించి తండ్రితో మాట్లాడుతానని.. కానీ లైన్ అండ్ లెంత్ గురించి మాత్రం తానే దృష్టి సారిస్తాను అంటూ అర్జున్ టెండూల్కర్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: