మరీ ఇంత బద్ధకమా బ్రో.. చివరికి వికెట్ పోయింది?
వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు అంటూ అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. కనీసం వికెట్ల మధ్య పరిగెత్తుతున్నప్పుడు అయినా కాస్త అలర్ట్ గా లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. బద్ధకంగా వికెట్ల మధ్య పరిగెత్తడం కారణంగా చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ 18 ఓవర్ ను జాసన్ బహెండార్స్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్ లతో వాషింగ్టన్ సుందర్ మంచి టచ్ లో కనిపించాడు. అయితే ఇక ఈ ఓవర్ లో ఐదవ బంతి ఫుల్ టాస్ గా వేశాడు బౌలర్.
ఈ బంతిని వాషింగ్టన్ సుందర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రిల్ చేసాడు అని చెప్పాలి. ఇక సింగిల్ కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తాడు. అయితే ఆ తర్వాత మాత్రం తన బద్ధకాన్ని చూపించాడు. మెల్లిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. దీంతో అతని త్రో వికెట్లకు తాగదనుకున్నాడో లేదా తాను అవుట్ కానన్న నమ్మకం పెట్టుకున్నాడో తెలియదు. కానీ కాస్త నెమ్మదిగా పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ నిర్లక్ష్యమే చివరికి దెబ్బ కొట్టింది. డైరెక్ట్ త్రో తగలడంతో సుందర్ వికెట్ కోల్పోయాడు.