ఐపీఎల్ : టి20 క్రికెట్ అని మరిచిపోయి.. టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు?

praveen
ఇటీవల కాలంలో తనను టెస్ట్ క్రికెట్లో ఆడనివ్వడం లేదని అదొకబూనాడో లేకపోతే తాను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని ఫీల్ అవుతున్నాడో తెలియడం లేదు కానీ కేఎల్ రాహుల్ దంచి కొట్టాల్సిన ఐపీల్ టోర్నీలో.. జిడ్డు బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఏకంగా జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి జట్టుకు భారంగా మారే ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ ఇలాగే జిడ్డు బ్యాటింగ్ తో చిరాకు తెప్పించాడు అని చెప్పాలి.



 ఏకంగా 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. టి20 క్రికెట్లో  ఎటాకింగ్ గేమ్ ఆడాల్సింది పోయి వన్డే టెస్ట్ తరహాలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీస్తూ ఉన్నాడు కేఎల్ రాహుల్. ఇక భారీ స్కోర్ చేయలేక వికెట్ కోల్పోతూ ఉన్నాడు. కేవలం ఒక్క మ్యాచ్ లో ఇలా ఆడాడు అంటే ఎవరు పట్టించుకునే వారు కాదేమో.. ఇప్పటివరకు కేఎల్ రాహుల్ ఆడిన ఆరు మ్యాచ్లలో కూడా ఇదే ఆట తీరును కొనసాగించాడు. కాగా ఇటీవలే రాజస్థాన్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ కు కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే లైవ్ కామెంట్రీ లో పీటర్సన్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 రాజస్థాన్ తో మ్యాచ్ లో లక్నో కెప్టెన్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తనకు పరమ బోరింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు కెవిన్ పీటర్సన్. ఇంతకుముందు ఎప్పుడూ కూడా కేఎల్ రాహుల్ ఇలా బ్యాటింగ్ చేయడం చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందిస్తున్న నేటిజన్స్ కెవిన్ పీటర్సన్ అన్నమాట అక్షరాలు నిజం.. టి20 లో వన్డే టెస్ట్ ఫార్మాట్  బ్యాటింగ్ను కేఎల్ రాహుల్ కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోను కేఎల్ రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్ తో విసిగిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: