ఈ విజయం.. ఆర్సిబి ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్?
కోహ్లీ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. అయితే కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత డూప్లెసెస్ కి సారధ్య బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం. కానీ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కెప్టెన్ గా మారితే ఎంత బాగుండు అని అభిమానులు అందరూ కోరుకున్నారు. కానీ అది జరగదు అని వారికి అర్థమయిపోయింది. కానీ ఎట్టకేలకి కోహ్లీని మరోసారి బెంగళూరు జట్టు కెప్టెన్ గా చూడగలిగారు అభిమానులు. ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండేళ్ల తర్వాత మళ్లీ అతను బెంగళూరు నాయకుడిగా వ్యవహరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో ఆర్సిబి కెప్టెన్ డూప్లెసిస్ కి పక్క టెముకల గాయమైంది. దీంతో పూర్తిగా కోలుకోని అతను పంజాబ్ మ్యాచ్లో కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చాడు. దీంతో ఇక కెప్టెన్ లేకపోవడంతో సారధ్య బాధ్యతలను విరాట్ కోహ్లీ భుజాన వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు జట్టు.. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కోహ్లీ ఎన్నో రోజుల తర్వాత కెప్టెన్సీ వహించడంతో ఈ విజయం అటు అభిమానులందరికీ ఎంతో స్పెషల్ గా మారింది అని చెప్పాలి.