ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా నేడు
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం పోటా పోటీగా తలపడనుంది.ఇక ఈ మ్యాచ్ చెన్నైలోని
చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. 16వ సీజన్లో రెండు జట్ల ప్రచారాన్ని కనుక గమనిస్తే..
చెన్నై ఇప్పటి దాకా ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 ఆటలే ఓడింది. మరోవైపు
హైదరాబాద్ టీమ్ తన 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండే గెలిచింది. ఇక ఈ రోజు మ్యాచ్‌లో
ధోని తన సిక్సర్లతో మరోసారి అలరించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. పైగా ఈ మ్యాచ్
చెన్నై వేదికగా జరగడంతో
ధోని ప్రభావం మ్యాచ్‌పై చాలా ఎక్కువగా ఉండనుంది. మరోవైపు సీఎస్కే బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. టీమ్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ఇంకా డెవాన్ కాన్వే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చే రహానే, ఆపై క్రీజులోకి ఆడుగుపెట్టే శివమ్ దుబే కూడా సూపర్ పెర్ఫార్మన్స్ ని కనబరుస్తున్నారు. అంబటి రాయుడు ఇంకా మొయిన్
అలీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా.. జడేజా, కెప్టెన్ ధోనీ ఫినిషింగ్ బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు.
అలాగే మహేశ్ తీక్షణ , తుషార్ దేశ్ పాండే ఇంకా మతీషా పతిరానా
చెన్నై టీమ్‌కి బౌలింగ్ అందిస్తున్నారు. ఇంకా అలాగే జేడేజా, మోయిన్
ఆలీ కూడా బౌలింగ్ చేస్తున్నారు.ఇక అలాగే మన సన్‌రైజర్స్
హైదరాబాద్ టీమ్ గురించి చెప్పుకోవాలంటే హ్యారీ బ్రూక్ చేసిన సెంచరీతో అతను గాడిలో పడ్డాడని అంతా కూడా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చిందని ఈ నెల 18 వ తేదీన
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది.
మయాంక్ అగర్వాల్ ఫామ్‌కి వచ్చినందు వలన టీమ్‌కి అతను బలమైన బ్యాట్స్‌మ్యాన్‌గా మారాడు. ఇంకా అలాగే
రాహుల్ త్రిపాఠి, ఆడమ్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ అలాగే
అభిషేక్ శర్మ కూడా రాణిస్తే చెన్నైటీమ్కి ఇక కష్టాలు ఖచ్చితంగా తప్పవు. బౌలింగ్‌లో హైదరాబాద్ తరఫున
భువనేశ్వర్ కుమార్ తప్ప మిగిలినవారు పెద్దగా రాణించడం లేదు. మరి ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్,
మయాంక్ మార్కండే ఇంకా ఉమ్రాన్
మాలిక్ ఎలా రాణిస్తారో చూడాలి.