పాపం కేఎల్ రాహుల్.. గెలిచామన్న ఆనందం లేకుండా పోయిందే?

praveen
గత ఏడాది నుంచి ఐపీఎల్ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన లక్నో జట్టు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అలాంటి ప్రదర్శనతోనే అభిమానులను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ పై కూడా ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.


 రాజస్థాన్ రాయల్స్ జట్టులో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో 10 పరుగులు తేడాతో విజయం సాధించింది కేఎల్ రాహుల్ సేన. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కాగా 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పది పరుగుల తేడాతో లక్నోకీ విజయం వరించింది. దీంతో జట్టు సభ్యులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. కానీ ఇలా మ్యాచ్ గెలిచాము అన్న ఆనందం కేఎల్ రాహుల్కు లేకుండా పోయింది.


 ఎందుకంటే లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు ఐపీఎల్ నిర్వహకులు ఏకంగా 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగానే ఈ జరిమానా విధించినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లు మూడు గంటల 20 నిమిషాల్లోనే ముగియాలని నిర్వాహకులు రూల్ పెట్టారు. అయితే కొన్ని మ్యాచ్లు మాత్రం స్లో ఓవర్ రేట్ కారణంగా ఆలస్యం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. రాజస్థాన్ తో మ్యాచ్ లో లక్నో స్లో ఓవర్ రేటు నమోదు చేయడంతో జరిమాన కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: