ఆటలోనే కాదు.. ఫైన్ కట్టడంలో కూడా.. విరాట్ కోహ్లీ నెంబర్.1?

praveen
విరాట్ కోహ్లీని అభిమానులు అందరూ కూడా రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో అతను సాధించిన రికార్డులు అలాంటివి. ఎంతో మంది లెజెండరి ప్లేయర్స్ తమ కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డులను అటు విరాట్ కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే సాధించి తన పేరును లిఖించుకున్నాడు అని చెప్పాలి. ఇలాంటి రికార్డులు సాధించాడు కాబట్టే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అతనికి రికార్డుల రారాజు అని ముద్దు పేరు పెట్టారు.


 అయితే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి ఏకంగా దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంక ఏదో నిరూపించుకోవాలనే కసి ఉండే యువ ఆటగాడు లాగానే విరాట్ కోహ్లీ కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ప్రపంచ క్రికెట్లో ఎలాంటి రికార్డు ఉన్న దానిని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టేస్తాడు అని అందరూ అంటూ ఉంటారు. నిజమేనేమో ఇప్పుడు ఆట విషయంలోనే కాదు జరిమానా కట్టడం విషయంలో కూడా విరాట్ కోహ్లీ అందరి రికార్డులను బద్దలు కొట్టేసి మొదటి స్థానంలో నిలిచాడు.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఎక్కువ మొత్తంలో జరిమానా కట్టిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ మారిపోయాడు అని చెప్పాలి. ఇటీవల బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలిచినప్పటికీ స్లో ఓవర్ రేట్ నమోదయింది. సాధారణంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయితే 12 లక్షలు జరిమానాలు విధిస్తారు. కానీ బెంగళూరు స్లో ఓవర్ రేట్ దారుణంగా ఉండడంతో ఇక 24 లక్షలు ఫైన్ వేశారు. అంతేకాకుండా జట్టులోని సభ్యులందరికీ కూడా ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25%.. ఏది ఎక్కువైతే అది జరిమానా విధించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: