హార్థికా మజాకా.. మళ్లీ అగ్రస్థానానికి?

praveen
మొన్నటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీమ్స్ అనగానే ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల గురించి అందరూ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఛాంపియన్ అనే పేరు వినిపించగానే అందరికీ ఎక్కువగా గుర్తొస్తుంది మాత్రం అటు గుజరాత్ టైటాన్స్ అని చెప్పాలి. గత ఏడాది కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్థానాన్ని మొదలుపెట్టింది గుజరాత్ జట్టు. అప్పటివరకు కెప్టెన్సీలో ఎక్కడ అనుభవం లేని హార్దిక్ పాండ్యా సారధిగా వ్యవహరించాడు.

 ఐపీఎల్ లో అన్ని జట్లు ఉన్నాయి అన్ని జట్ల లాగానే గుజరాత్ టైటాన్స్ కూడా ఒకటి అని అందరూ అనుకున్నారు. కానీ తాము అందరిలాంటి టీం కాదని ఛాంపియన్ టీం అనే విషయాన్ని మొదటి సీజన్లోనే నిరూపించింది గుజరాత్ టైటాన్స్. హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే ఇక ఇప్పుడు రెండో సీజన్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది గుజరాత్. ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఎనిమిది మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించింది. ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు.

 హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి చూపిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఏకంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది గుజరాత్. అయితే ఈ విజయం ద్వారా మూడో స్థానం నుంచి ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరుకుంది అని చెప్పాలి. ఇక గుజరాత్ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 10 పాయింట్లతో తర్వాత స్థానంలో ఉన్నాయి. బెంగళూరు, పంజాబ్ జట్లు చేరో ఎనిమిది పాయింట్లతో ఐదు, ఆరు స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఇక గుజరాత్ టైటాన్స్ జోరు చూస్తే టైటిల్ గెలవడం ఖాయం అన్నట్లుగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: