సెంచరీతో చెలరేగిన పుజారా.. అరుదైన రికార్డ్?
అంతేకాదు ఇక భారత క్రికెట్లో నయా వాల్ గా కూడా ప్రత్యేకమైన బిరుదును సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కౌంటింగ్ క్రికెట్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన పూజార మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు మళ్లీ కౌంటి క్రికెట్లో ఆడుతూ తన ఫామ్ ను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ నిలకడగా రాణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం కౌంటింగ్ క్రికెట్లో కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు.
గతంలోనే ఇంగ్లాండు కౌంటి క్రికెట్లో సెంచరీల మోత మోగించిన చటేశ్వర్ పూజార.. ఇక ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండులో సస్సేక్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతను గ్లౌసెస్టర్ షైర్ జట్టుపై 151 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే చటేశ్వర పూజారకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 58వ సెంచరీ కావడం గమనార్హం. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లొ సాధించిన 57 సెంచరీల రికార్డును పూజార వెనక్కి నెట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విజయ్ హజారే తర్వాత స్థానాల్లో నిలిచాడు పూజారా. ఏది ఏమైనా అతని ఫాంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషంగానే ఉన్నారు అని చెప్పాలి.