ధోని రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా.. రవిశాస్త్రి ఏమన్నాడంటే?
అయితే మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ భారత జట్టు లోకి వస్తాను అంటే అటు అభిమానులు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సెలెక్టర్లు కూడా కళ్ళకు అద్దుకొని అతన్ని జట్టు లోకి ఎంపిక చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతలా తన ఆట తీరు తో తన కెప్టెన్సీ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. మరి నిజం గానే అభిమానులు కోరుకున్నట్లుగా మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయంపై ఇటీవలే టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ఒకవేళ ధోని రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుని వస్తే.. అతన్ని పరిగణలోకి తీసుకుంటారా అంటూ ప్రశ్నించగా రవి శాస్త్రి ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోని రిటైర్మెంట్ ని అస్సలు వెనక్కి తీసుకోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే అదే ఫైనల్ అవుతుంది. మరో సంవత్సరం ఆడే అవకాశం ఉన్నప్పటికీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇతరులకు అవకాశం దక్కుతుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. 100 టెస్టులు ఆడి ఘనంగా వీడ్కోలు పలికే సత్తా ఉన్నప్పటికీ కూడా ధోని ఇతరుల కోసం ఆ త్యాగం చేశాడు అంటూ రవి శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.