ఏంటి.. అంత పెద్ద గొడవ జరగడానికి.. సిరాజే కారణమా?

praveen
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకొంతమంది స్టేడియం కు తరలివెళ్లి మ్యాచ్ వీక్షిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ఐపీఎల్ మ్యాచ్ ఉత్కంఠ మధ్యలో అటు బీసీసీఐ బాదుడు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. మ్యాచ్ మధ్యలో ఏదైనా జరిగినప్పుడు కాస్త గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు.. ఇక జరిమాణాలు విధిస్తుంది బీసీసీఐ. ఇక ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా కోట్ల రూపాయలు అటు బీసీసీఐ ఖాతాలో చేరిపోయాయి.


 ఇకపోతే ఇటీవలే లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ, గంభీర్ మ్యాచ్ ఫీజు 100% కోత విధించింది బీసీసీఐ. ఇక గొడవకు కారణమైన బౌలర్ నవీన్ ఉల్హాక్ కి 50% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  అయితే ఇంత గొడవ జరగడానికి కారణమైన మహమ్మద్ సిరాజ్ ను మాత్రం అటు బీసీసీఐ పట్టించుకోకుండా వదిలేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అదేంటి గొడవకి సిరాజ్ కి సంబంధం ఏముంది అని అనుకుంటున్నారు కదా.


 ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ ఓవర్ లో ఆఖరి బంతికి నోబాల్ వేశాడు. అంపైర్ మొదట వైడ్ గా ప్రకటించగా.. థర్డ్ ఎంపైర్ దాని నోబాల్ గా గుర్తించాడు. తర్వాత బంతికి సింగిల్ కూడా తీయనివ్వలేదు మహమ్మద్ సిరాజ్. అయితే బ్యాట్స్మెన్ నవీన్ వుల్ హక్ దగ్గరికి వెళ్లి ఇక కావాలని బంతి వికెట్లకేసి కొట్టాడు సిరాజ్. సిరాజ్ చేసిందానికి నవీన్ ఉల్హక్  ఆశ్చర్యపోయాడు. సంఘటన తర్వాత ఆవేశంతో  ఊగిపోయాడు నవీన్ ఉల్ హక్. ఇక తర్వాత ఓవర్ లోనే ఫోర్ బాధటంతో.. విరాజ్ కవ్వింపులకు దిగడంతో  చిన్నచిన్నగా మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఒక రకంగా అంత గొడవ జరగడానికి అగ్గిరాజేసింది మాత్రం సిరాజ్ అని అందరికీ అర్థమైంది కానీ..  ఇది పట్టించుకోకుండా అతని వదిలేసింది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: