ఏంటయ్యా ఆర్చర్ ఇలా చేశావ్.. పాపం ఇదే మొదటిసారి?
అయితే అతను గాయం కారణంగా ఏకంగా ఒక సీజన్ కి అందుబాటులో లేకపోయినప్పటికీ ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జఫ్రా ఆర్చర్ ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అయితే అతను ఇటీవల సర్జరీ చేసుకొని ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్తో మళ్ళీ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇక అతను వచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా లేని లోటు తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం.
ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో జఫ్రా ఆర్చర్ తన బౌలింగ్ తో ఎక్కడ ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లు మూడు సిక్సలతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ భారీ స్కోరు చేయడానికి జఫ్రా ఆర్చర్ కారణం అని చెప్పాలి. ఐపిఎల్ లో ఒక్క మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీయకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం జఫ్రా ఆర్చర్ ఇదే తొలిసారి. చివరికి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఈ స్టార్ బౌలర్. అయితే అతని కంటే అర్జున్ బెటర్ అని అతను కనీసం వికెట్లు అయినా తీస్తున్నాడని కొంతమంది ముంబై ఇండియన్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.