అతని బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం : గంగూలీ

praveen
సాధారణంగా ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో ఎంతోమంది జూనియర్ క్రికెటర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంటారు . అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించటమే లక్ష్యంగా పెట్టుకునే యువ క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా వచ్చిన ఛాన్స్ ని బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దీంతో ఐపీఎల్ సీజన్ అనేది  తమకు డూ ఆర్ డై టోర్నీగా భావిస్తూ ఇక తమలో ఉన్న సత్తా మొత్తాన్ని కూడా బయట పెడుతూ సెలెక్టర్లు  దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఎప్పుడు చూసినా ప్రతి సీజన్లో యువ ఆటగాళ్లదే  హవా నడుస్తూ ఉంటుంది.


 కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఇందుకు భిన్నంగా కెరియర్ ముగిసిపోయింది అని అందరూ భావిస్తున్న సీనియర్ క్రికెటర్లదే ఎక్కువగా హవా నడుస్తుంది. తక్కువ ధరతోనే ఐపీఎల్లోకి వచ్చి కొన్ని జట్ల తరపున ప్రాతినిధ్యం ఆశిస్తున్న ఆటగాళ్లు.. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్గా సీనియర్ క్రికెటర్ గా ముద్రపడిన అజంక్య రహనే చెన్నై జట్టు తరఫున ఆడుతున్న మెరుపు ఇన్నింగ్స్ లను చూసి ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు అజంక్య రహనే.



 ఇకపోతే ఇలా తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరిస్తున్న అజింక్య రహనే పెర్ఫార్మన్స్ గురించి మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  రహనే బ్యాటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. డబ్ల్యుటిసి ఫైనల్లో రహానే గొప్పగా రాణిస్తాడు అని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో దేశం తరఫున ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడని గుర్తు చేశాడు సౌరబ్ గంగూలీ. తుది జట్టులో ఛాన్స్ దక్కితే అతను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు సౌరబ్ గంగూలీ . కాక ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేయడంతో డబ్ల్యూటీసి ఫైనల్ కోసం రహానేను ఎంపిక చేసింది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: