వైరల్ : ఈ బుడ్డోడు క్రికెట్ ను ఏలేస్తాడు.. చూస్తే మీరు అదే అంటారు?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఎంతో మంది యువకులు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపిస్తూ అయితే ఇటీవల కాలంలో అటు క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అంతకంతకు పెరిగిపోతున్న పెరిగిపోతున్న నేపథ్యంలో  క్రికెట్ కి సంబంధించిన ఏ చిన్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన కూడా అది తెగ వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి.



 ముఖ్యంగా ఎంతో మంది చిన్నారులు అంతర్జాతీయ క్రికెటర్ల తరహాలోనే అద్భుతంగా క్రికెట్ ఆడుతున్న వీడియోలు అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. సాధారణంగా రెండు లేదా మూడేళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఎవరైనా ఏం చేస్తారు అంటే.. ఇంకేం చేస్తారు తోటిస్నేహితులతో సరదాగా ఆడుకుంటూ.. ఏదో ఒక చిలిపి పనిచేయడం చేస్తూ ఉంటారు అని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ బుడ్డోడిని చూస్తే మాత్రం ఈ అభిప్రాయాన్ని తప్పకుండా అందరూ మార్చుకుంటారు.


 ఇక్కడ వీడియోలో చూస్తున్న బుడ్డోడికి దాదాపు  మూడేళ్లు వయస్సు ఉంటుంది. అయితే మూడేళ్ల వయసులోనే అతను అంతర్జాతీయ క్రికెటర్ స్థాయిలో అదరగొడుతున్నాడు. ఎలాంటి బంతినైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇక బౌండరీ తరలించే లాగానే షాట్లు కొడుతున్నాడు. అతను ఆడుతున్న తీరు చూసి నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్ ఎలా సొంతమైందో అర్థం కాక నేటిజన్స్ మతిపోతుంది. మధుశనక ఫ్యాన్స్ అని ఉన్న ఒక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో పోస్ట్ చేయగా.. ఇది వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత ఈ బుడ్డోడు ఎప్పటికైనా ఇంటర్నేషనల్ క్రికెట్ ని ఏలుతాడు అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: