హమ్మయ్యా.. కోహ్లీ నాలుగేళ్లకు సాధించాడబ్బా?

praveen
విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటే.. ఇతని పేరే మొదట వినిపిస్తూ ఉంటుంది. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన ఆట తీరుతో రికార్డులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా ఛేదించిన విరాట్ కోహ్లీ.. తనకు తిరుగులేదు అని నిరూపించాడు. తాను అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు చరిత్ర సృష్టించే ఆటగాడిని అన్న విషయాన్ని తన బ్యాట్ తోనే నిరూపించాడు కోహ్లీ.

 ఇప్పుడు వరకు ఏకంగా 75 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు అంటే ప్రపంచ క్రికెట్లో అతని విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ ఆ తర్వాత అదిరిపోయే కంబాక్స్ ఇచ్చి సెంచరీలతో చెలరేగాడు. అయితే అటు ఐపిఎల్ లో కోహ్లీ సెంచరీ చూడాలని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇటీవల అభిమానుల కోరిక నెరవేరింది అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ.  62 బంతుల్లో 12 ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో   శతక్కొట్టాడు అని చెప్పాలి.

 ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ చేసిన సెంచరీ అతని కెరియర్ లో ఐపీఎల్ హిస్టరీలో ఆరో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అభిమానులందరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇలా సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ గా వెనుతిరిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలోకి దూసుకు వచ్చింది అని చెప్పాలి. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: