క్వాలిఫైయర్ 2 కి ముందు.. ముంబై ని అదొక్కటే భయపెడుతుంది?
గత ఏడాది వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే చివరికి వెనదిరిగింది అన్న విషయం తెలిసిందె. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగించిన ముంబై ఇండియన్స్.. అటు దారుణమైన రన్ రేట్ మైంటైన్ చేసింది. కానీ అదృష్టం కలిసి వచ్చి ఇక ముంబై ఇండియన్స్ అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం కాస్త పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ అటు బౌలింగ్ విభాగం మాత్రం పూర్తిగా బలహీనంగా ఉంది. అయితే ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే నాకౌట్ మ్యాచ్ లలో కూడా ముంబై ఇండియన్స్ ని ఈ బౌలింగ్ వైఫల్యమే భయపెడుతుంది అని చెప్పాలి.
ముంబై ఇండియన్స్ లో కీలక బౌలర్ అయిన బుమ్రా ప్రస్తుతం సర్జరీ కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక జట్టును ముందుండి నడిపిస్తాడు అనుకున్న ఆర్చర్ కేవలం కొన్ని మ్యాచ్లకే పరిమితం అయ్యాడు. నిలకడగా రాణించే తిలక్ వర్మ ఇక కీలకమైన మ్యాచ్ లకు దూరంగానే ఉన్నాడు. అనుభవం లేని బౌలింగ్ ముంబై ఇండియన్స్ భయపెడుతుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య అదృష్టవశాత్తు ముంబై ప్లే ఆఫ్ కు వెళ్ళింది. కానీ ఇక కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం ముంబై ఇండియన్స్ గెలుస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ నాలుగు సార్లు రెండు వందలకు పైగా స్కోర్ లను చేదించిన.. బౌలింగ్ బలహీనత మాత్రం ఆ జట్టును తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్లే ఆఫ్ లో రోహిత్ సేన ప్రదర్శన ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.