సమ్మర్లో జనాలని బాగా ఎంటర్టైన్ చేసిన IPL 2023 చివరి దశకు వచ్చేసింది. మే 28న ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ అలాగే గుజరాత్ టైటాన్స్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది.ఇక ఈ నేపథ్యంలో ఐపీఎల్ విన్నర్, రన్నరప్‌గా నిలిచిన టీమ్స్ కి ఇంకా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు ఎంత మొత్తం అందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..గత సీజన్ లాగానే ఐపీఎల్ 2023 విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ రాబోతుంది. ఇక రేపు జరిగే ఫైనల్లో గుజరాత్, చెన్నె టీమ్స్ లో విజేతగా నిలిచిన వారికి ఈ డబ్బుని అందించనున్నారు. ఇంకా అలాగే రన్నరప్ నిలిచిన జట్టుకు మొత్తం రూ.13 కోట్ల మొత్తం అందనుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌కు మొత్తం రూ.7 కోట్లు అందనుండగా,ఎలిమినేటర్‌లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మొత్తం 6.5 కోట్లు క్యాష్ రివార్డ్ అందనుంది.ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ తో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి కూడా అందిస్తారు. అలాగే ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచులు ఆడిన గిల్..మొత్తం 851 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో ఫాప్ డుప్లెసిస్(730), విరాట్ కోహ్లీ(639) ఇంకా డెవాన్ కాన్వే(625) ఉన్నారు.అలాగే ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ క్యాప్ తో పాటు ఇంకా రూ. 15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఈ లిస్టులో ప్రస్తుతం మహ్మద్ షమీ(28) అగ్రస్థానంలో ఉండగా, రషీద్ ఖాన్(27) ఇంకా మొహిత్ శర్మ(24) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు రూ. 20 లక్షలు నగదు బహుమతిని అందిస్తారు. దీనికి 1995 ఏప్రిల్ 1 తర్వాత జన్మించి.. ఐదు టెస్టుల కంటే తక్కువ ఇంకా 20 వన్డేలు కూడా ఆడని ఆటగాళ్లు ఈ అవార్డుకు అర్హులు. అలాగే ఆ ఆటగాడు ఐపీఎల్‌లో 25 కంటే తక్కువ మ్యాచ్‌లని ఆడి ఉండాలి. ఇంకా వీటితో పాటు ఈ సీజన్‌లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌కు రూ. 12 లక్షలు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.15 లక్షలు అలాగే గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.15 లక్షలు ఇంకా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.12 లక్షలు లభించనున్నాయి. మొత్తానికి మంచి ప్రదర్శన చేసిన వారికి టాలెంట్ వున్నవారికి నిజంగా IPL వరమనే చెప్పాలి.