నేడు టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే పుట్టినరోజు. చాలా కాలం టీంకి దూరంగా వున్న రహానే ఇటీవల ఐపీఎల్‌లో మెరిసాడు. IPL లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కూడా కనబరుస్తానని అజింక్య రహానే అన్నాడు.కొన్ని సంవత్సరాల విరామం తర్వాత జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో తలమునకలైన అతను మాట్లాడుతూ '18, 19 నెలల తరువాత మళ్లీ జట్టులోకి వచ్చాను.నా గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందనే దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియా తరఫున తాజాగా ఆటను ప్రారంభిస్తా.ఇక మైదానంలో నేనేం చేయగలనో అదే చేస్తాను' అని రహానే తెలిపాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదించానని అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేశానని, అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించానని చెప్పుకొచ్చాడు.'ఇప్పుడు కూడా నేను అదే మైండ్‌సెట్‌తో ఆడతాను. ఇది టెస్టా... టి20 మ్యాచా అన్నది నేను ఆలోచించను. నా సహజశైలిలో నేను బాగా బ్యాటింగ్ చేస్తాను' అని రహానే అన్నాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా చాలా పటిష్టంగా ఉందన్నాడు.చూడాలి రహానే ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో..ఇదిలా ఉండగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 నేపథ్యంలో మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.అలాగే తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలో సూచనలు ఇస్తునారు. ఇక ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ తమ అభిప్రాయాలను పంచుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 తుది జట్టులో వికెట్ కీపర్‌గా తెలుగు ఆటగాడు అయిన శ్రీకర్ భరత్ కంటే ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. ఇక కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చి రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్ పేర్కొన్నాడు. అందుకు ఆరో స్థానంలో ఇషాన్ బాగా సరిపోతాడన్నాడు. అలాగే అజింక్య రహానే కూడా ఉన్నాడు.