అరుదైన రికార్డ్.. నాకౌట్ మ్యాచ్లలో కోహ్లీనే తోపు?

praveen
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి రికార్డులు సాధించడం కొత్తేమీ కాదు  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన కెరియర్ లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఇక తన అభిమానులు అందరికీ కూడా రికార్డుల కింగుగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఎలాంటి రికార్డు అయినా సరే కోహ్లీ ఆట ముందు దాసోహం కావాలి అనేట్లుగా అతని ప్రస్థానం కొనసాగింది.


 అయితే ఇప్పటివరకు సాధించిన రికార్డులు చాలావు అన్నట్లు కోహ్లీ ప్రతి మ్యాచ్ లో కూడా ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూనే ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం కోహ్లీ అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా టీమ్ ఇండియాను గెలిపించేందుకు హోరాహోరీగా పోరాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కోహ్లీ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.



 నాకౌట్ మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ గా సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో మొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగేవాడు. అయితే కోహ్లీ సచిన్ను అధికమించి 660 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక డబ్ల్యూటీసి టోర్నీ లోను టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా పై విరాట్ కోహ్లీ 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా పై రెండు వేల పరుగుల మార్క్ అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: