డబ్ల్యూటీసి ఫైనల్ ఓటమే కాదు.. టీమిండియా కు మరో షాక్.
ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా చేసిన చెత్త ప్రదర్శన పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ పూర్తయి రోజులు గడుస్తున్న కూడా ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా చేసిన ప్రదర్శన గురించి మాత్రం విమర్శలు ఆగడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి టీం ఇండియా ప్లేయర్స్ తో పాటు అభిమానులు కూడా నిరాశలు మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఇక భారత జట్టుకు మరో ఊహించని షాప్ తగిలింది. మూలకే నక్క పై తాటి పండు పడ్డట్లు అయింది టీమ్ ఇండియా పరిస్థితి. ఎందుకంటే స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ ఇండియాకు భారీ జరిమానా పడింది.
అయితే కేవలం భారత్కు మాత్రమే కాదు ఆస్ట్రేలియా జట్టుకు కూడా ఇలాంటి షాక్ తగిలింది అని చెప్పాలి. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా స్లో ఓవర్ రేట్ నమోదు చేశాయట. ఈ క్రమంలోనే భారత జట్టుకు 100% ఆస్ట్రేలియా కు 80% మ్యాచ్ ఫీజులో కోత విధించింది ఐసిసి. అదే సమయంలో తన అవుట్ పై సెటైరికల్ పోస్ట్ పెట్టిన శుభమన్ గిల్ కు కూడా ఏకంగా మ్యాచ్ ఫీజులో 115% కోత విధించింది ఐసీసీ. గిల్ అవుట్ పై వివాదం చెలరేగగా.. అతడు కోడ్ ఆఫ్ కండక్టును ఉల్లంఘించాడు అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. ఇలా ఒకవైపు ఓటమితో పాటు మరోవైపు స్లో ఓవర్ రేట్ జరిమానా కారణంగా టీమిండియా కు మరో షాక్ తగిలింది అని చెప్పాలి.