బాబర్ కు షాక్.. అనామక ప్లేయర్ కి ఐసిసి అవార్డు?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు అటు ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి ఇక అవార్డులు ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రతివారం ఎలా అయితే మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ ఉంటుందో.. ఇక అలాగే ప్రతి నెల కూడా  ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇక కొన్ని నామినేషన్స్ తీసుకొని ఇక వారిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించడం చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన ఎంతోమంది ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకోవడం చూస్తూ ఉంటాం.


 ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ.. ఎంతలా అభిమానులను సొంతం చేసుకున్నప్పటికీ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకోవడాన్ని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే  ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న ప్లేయర్లకే.. ఎక్కువగా ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు దక్కే ఛాన్సులు ఉంటాయి. కానీ ఈ విషయంలో అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కి ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న ఒక అనామక  క్రికెటర్ కి ప్లేయర్ అఫ్ ది మంత్ అవార్డు దక్కింది.



 ఇటీవల ఐసీసీ ప్రకటించిన మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐర్లాండ్ కు చెందిన హరి డెక్కర్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఈ అవార్డుకు ఐర్లాండ్ టీం తరఫున ఎంపికైన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు హరీ డెక్కర్. వన్డేల్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బాబర్ అజం, బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నజ్మూన్ హుస్సేన్ నుంచి నెలకొన్న గట్టి పోటీని సైతం అధికమించి హారి ఎంపిక కావడం విశేషం. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేల్లో హరి కేవలం 113 బంతుల్లోనే 140 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇలా స్టార్ బ్యాట్స్మెన్ లు పోటీలో ఉన్న అతను అవార్డును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: