బెన్ స్టోక్స్ నిర్ణయానికి.. నోరెళ్లపెట్టిన కామెంటేటర్లు?
ఇక ఇలా కొత్తగా బజ్ బాల్ విధానాన్ని పాటిస్తూ ఇక వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ఇంగ్లాండు టీం. అయితే ఈ బజ్ బాల్ విధానంలో భాగంగా అటు జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇలా అనూహ్యమైన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ నిర్ణయాలతో అటు మ్యాచ్ కు వ్యాఖ్యాతలుగా ఉన్న లెజెండ్స్ సైతం షాక్ అయ్యారు అని చెప్పాలి.
ఇటీవలే తొలి టెస్ట్ మ్యాచ్లో తొలిరోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరిని అవాక్కయ్యేలా చేశాడు బెన్ స్టోక్స్. ఇక రెండో రోజు ఊహించని ప్లేయర్ తో బౌలింగ్ వేయించి మరింత ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హరిబూక్స్. అయితే బ్యాట్స్మెన్ గా ఎప్పుడు అవకాశాలు దక్కించుకుంటాడు. కానీ బౌలర్గా అతను బంతులు వేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా రెగ్యులర్ బౌలర్ కానీ హరి బ్రూక్స్ తో బంతి వేయించాడు. మ్యాచ్ కు వ్యాఖ్యాతగా ఉన్న రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ కామెంట్ చేయగా.. బజ్ బాల్ అంటే ఇదేనేమో అంటూ అటు మైఖేల్ కామెంట్ చేశాడు అని చెప్పాలి.