ఒకప్పుడు టీంలో స్నేహితుల ఉండేవారు.. కానీ ఇప్పుడు కొలీగ్స్ మాత్రమే : అశ్విన్

praveen
ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. 2021లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. 2023 లో కూడా ఇదే సీన్ రిపీట్ చేసింది. అయితే 2021లో 2023 లోను అటు భారత జట్టు  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లడానికి కీలక పాత్ర వహించిన అశ్విన్ కు ఇక 2023 డబ్ల్యూటీసి ఫైనల్ లో మాత్రం చోటు దక్కకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అతను లేకపోవడం వలన టీమిండియా ఓడిపోయింది అంటూ విమర్శలు కూడా చేశారని చెప్పాలి.



 అయితే స్వయంగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు తాను బౌలర్గా కాకుండా ఉండాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు.  బ్యాట్స్మెన్ లకు బౌలర్లకు వేరువేరు కొలమానాలు ఉంటాయని.. వేర్వేరుగా చూస్తారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి మాట్లాడుతూ ఒకప్పుడు జట్టులోని సహచరులు అందరూ స్నేహితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు అంటూ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు అశ్విన్.


 ప్రతి ఒక్కరు సహోద్యోగులుగా ఉండే కాలం ఇది. ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లో కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఇప్పుడైతే కొలీగ్స్ మాత్రమే. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు అందరి ధ్యాస ముందుకెళ్లడం మీదే ఉంది. పక్కనున్న వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి సంగతులు ఏం చేస్తున్నారని అడిగే తీరిక కూడా ప్రస్తుతం ఎవరికీ లేకుండా పోయింది. ఒకరి అభిప్రాయాలను మరొకరికి పంచుకుంటే ఆటతీరు మెరుగవుతుందని నేను బలంగా నమ్ముతాను. మరో ఆటగాడి టెక్నిక్ ను  అర్థం చేసుకున్నప్పుడు మన ఆట కూడా మెరుగుపడుతుంది. కానీ ఇప్పుడు అది ఎక్కడ జరగడం లేదు. ఎవరు సాయం కోసం రారు. ఇప్పుడు అంతా వారి ప్రయాణం వారిదే అంటూ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: