అయ్య బాబోయ్.. ఇదెక్కడి ఫీల్డింగ్ సెట్టింగ్ సామీ?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సిరీస్ ను రెండు జట్లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సిరీస్లో విజయాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించి  దేశ గౌరవాన్ని నిలబెట్టాలని ఇక జట్టు ఆటగాళ్లు ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక హోరాహోరీగా పోరాటం సాగిస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవలే ప్రారంభమైన యాషేష్ సిరీస్ 2023 తొలి టెస్ట్ లో పోరు నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో అటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్  తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తొలి ఇన్నింగ్స్ ని తక్కువ పరుగులకే డిక్లేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు రెగ్యులర్ బౌలర్లు కాని వాళ్ళతో సైతం బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా తనలో దాగి ఉన్న కెప్టెన్సీ నైపుణ్యాన్ని మొత్తం బయటపెడుతున్నాడు. ఇక ఇలా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు వ్యూహాలకు అనుగుణంగా కాకుండా పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సర్ప్రైజ్ ఇస్తున్నాడు అని చెప్పాలి.



 అంతేకాదు ఇక తొలి టెస్ట్ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను అవుట్ చేసేందుకు సెట్ చేసిన ఫీల్డింగ్  కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ముందుగా స్టీవ్ స్మిత్ ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్పులు, రెండు లెగ్ స్లిప్పులు మొహరించిన స్టోక్స్ ఆట మూడో రోజు ఉస్మాన్ ఖావాజపై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి వ్యూహాన్ని పన్నాడు బెన్ స్టోక్స్. ఫీల్డింగ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైనా ఖవాజా ఇక వారిపై నుంచి భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించి చివరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: