టీమ్ ఇండియా.. ఆటతీరు మార్చుకుంటే బెటర్ : గంగూలీ
ఇటీవల టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే చేసింది. అప్పటి వరకు ప్రత్యర్ధులు అందరిపై విజయం సాధించి ఇక డబ్ల్యూటీసి ఫైనల్ వరకు చేరుకుంది టీం ఇండియా. ఫైనల్ లో కూడా అదరగొడుతుందని సుదీర్ఘమైన ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలుస్తుందని అందరూ ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఊహించని రీతిలో ఆస్ట్రేలియాకు కనీస పోటీ ఇవ్వలేక తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుంది. దీంతో టీం ఇండియా ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఇక టీమిండియా ఆట తీరు మార్చాల్సిన అవసరం ఉందని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇక ఇటీవల ఇదే విషయం గురించి సౌరబ్ గంగూలీ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ల కిందటి తో పోల్చి చూస్తే క్రికెట్లో మార్పు వచ్చిందని దానికి తగ్గట్లుగానే టీమిండియా ఆట తీరు కూడా మారాలి అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 350 నుంచి 400 రన్స్ చేయాలని.. అప్పుడే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా అలా ఆడలేక పోతుందని.. ఎక్కువగా క్రికెట్ ఆడటం ఎక్కువగా.. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లపై ప్రభావం చూపుతుంది అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.