వామ్మో.. కోహ్లీని మించిపోయిన వెస్టిండీస్ కెప్టెన్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న జట్టులో ఉన్న ఆటగాల్లే ఇలా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని అంచనాలు పెట్టుకుంటారు. కానీ కొన్ని కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేని ప్లేయర్లు కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేసి రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు. ఇక వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా ఉన్నవారిని సైతం తమ అద్భుతమైన ఫాంతో వెనక్కి నెట్టేస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఇక వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ ప్లేయర్లుగా మొదటి స్థానంలో కొనసాగుతున్న బ్యాట్స్మెన్లు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం పేర్లను ముందుగా చెబుతూ ఉంటారు. కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించగా.. బాబాయ్ ఇప్పుడు తన అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇలాంటి అత్యుత్తమ క్రికెటర్లను ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేని ఒక ఆటగాడు వెనక్కి నెట్టాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు వెస్టిండీస్ కెప్టెన్ శాయ్ హోప్.



 గత కొంతకాలం నుంచి హోప్ అద్భుతమైన ఫాం ప్రదర్శిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. 2019 నుంచి 2023 మధ్య కాలంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా వెస్టిండీస్ కెప్టెన్ హోప్ అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. 2019 వరల్డ్ కప్ నుంచి ఈ ఏడాది వరల్డ్ కప్ వరకు కూడా క్వాలిఫైయర్స్ మ్యాచ్ ముందు వరకు కోహ్లీ, బాబర్ అజాంలను మించి హోప్ ప్రదర్శన చేశాడు. 46 ఇన్నింగ్స్ లలో 2021 పరుగులు చేశాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 1612 పరుగులు చేయగా, బాబర్ 1817 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: